: ఏపీలో ఆర్థిక ఆంక్షలు... చెల్లింపులను నిలిపేసిన ట్రెజరీలు!
రాష్ట్ర విభజన నేపథ్యంలో రెవెన్యూ లోటుతో సతమతమవుతున్న ఏపీ ప్రభుత్వం, తాజాగా ఆర్థిక ఆంక్షల బాట పట్టింది. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా సర్కారీ చెల్లింపులు నిలిచిపోయాయి. ఖజానా నుంచి ఎలాంటి బిల్లులను క్లియర్ చేయరాదని ఆర్థిక శాఖ ట్రెజరీలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక శాఖ ఉత్తర్వుల నేపథ్యంలో రాష్ట్రంలోని ట్రెజరీలు బిల్లుల చెల్లింపులను నిలిపివేశాయి. అంతేకాక ట్రెజరీల్లో కొత్త బిల్లుల స్వీకరణ కూడా నిలిచిపోయింది.