: ఎర్రచందనంపై అధికారులతో చంద్రబాబు సమీక్ష
ఎర్రచందనంపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఎర్రచందనం స్మగర్లపై ఈ-నిఘా, కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, ఎర్రచందనం వేలం ద్వారా రూ.850 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు చంద్రబాబుకు తెలిపారు. 10,500 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం స్టాక్ ఉందని, 10 వేల మెట్రిక్ టన్నుల ఎర్రచందనం వేలానికి సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 2600 మంది నేరస్తులను అదుపులోకి తీసుకున్నామని, 1550 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని సీఎంకు వివరించారు. ఈ సమీక్షకు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా హాజరయ్యారు.