: లక్షన్నర లోపు రుణమున్న రైతులకు రేపు ఒకేసారి రుణవిముక్తి: మంత్రి నారాయణ


ఏపీ మంత్రి నారాయణ రుణమాఫీ అంశంపై మాట్లాడారు. రూ.లక్షన్నర లోపు రుణమున్న రైతులకు రేపు ఒకేసారి రుణవిముక్తి కల్పిస్తామని చెప్పారు. 7,420 కుటుంబాల ఖాతాల్లో బుధవారం డబ్బు జమ చేస్తామని తెలిపారు. మిగిలిన ఖాతాలను తనిఖీ చేసి ఫిబ్రవరి 5 లోగా రుణవిముక్తి చేస్తామని అన్నారు. రుణమాఫీపై వస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని రైతులకు సూచించారు. రాజధాని కోసం ఇప్పటివరకు రైతులు 7,300 ఎకరాలు ఇచ్చారని, రాజధానికి భూములిచ్చే రైతులకు తక్షణ రుణమాఫీ అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News