: కేసీఆర్ కారణంగానే రాజయ్యకు గుండెపోటు: మోత్కుపల్లి


తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యకు గుండెపోటు రావడానికి కేసీఆరే కారణమని ఆరోపించారు. కేసీఆర్ అనైతిక చర్య వల్ల రాజయ్య మనస్తాపం చెందారని, అందుకే గుండెపోటు వచ్చిందని అన్నారు. రాజయ్య చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రి వద్దకు వచ్చిన సందర్భంగా మోత్కుపల్లి ఈ వ్యాఖ్యలు చేశారు. రాజయ్యను బర్తరఫ్ చేయడం దారుణమని అభిప్రాయపడ్డారు. రాజకీయంగా రాజయ్యను హత్య చేశారని అన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా నడుస్తున్న టీఆర్ఎస్ సర్కారును బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ దుర్మార్గం నేపథ్యంలో రాజకీయాలను పక్కనబెట్టి మాదిగలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News