: 'సై' లేటెస్ట్ హిట్ 'జెంటిల్మన్'పై దక్షిణ కొరియాలో నిషేధం
యూట్యూబ్ రికార్డులను తిరగరాస్తూ నెట్టింట్లో సునామీ సృష్టిస్తోన్న 'జెంటిల్మన్' గీతంపై దక్షిణకొరియాలో నిషేధం విధించారు. గాంగ్నమ్ స్టయిల్ తో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న దక్షిణకొరియా పాప్ సెన్సేషన్ 'సై' రూపొందించిందే ఈ 'జెంటిల్మన్' కూడా. అయితే, ఈ పాటలో సై ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తూ కనిపించే సన్నివేశాలు.. యువతను తప్పుదోవ పట్టిస్తాయంటూ, అక్కడి టెలివిజన్ యాజమాన్యాలు ఈ హిట్ సింగిల్ ను ప్రసారం చేయరాదని తీర్మానించాయి. కాగా, విడుదలైన ఐదురోజుల్లోనే ఈ పాటను యూట్యూబ్ లో 15 కోట్ల మందికి పైగా వీక్షించడం విశేషం.