: 'హెడ్ గ్రాయిన్ బ్రేక్ వాటర్ టెక్నాలజీ'పై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నాస్త్రం
తీర ప్రాంతాల్లో సముద్ర కోత అంశంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సముద్ర తీర ప్రాంతం కోత విషయాన్ని సర్కారు తీవ్రంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. విశాఖలో ఆర్కే బీచ్ లో కోతకు గురైన ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడారు. ఎప్పుడూ విదేశీ యాత్రలు చేసే ముఖ్యమంత్రి చంద్రబాబుకు 'హెడ్ గ్రాయిన్ బ్రేక్ వాటర్ టెక్నాలజీ' గురించి తెలియదా? అని ప్రశ్నించారు. తీర ప్రాంత కోత ముప్పును తగ్గించేందుకు విదేశాల్లో 'హెడ్ గ్రాయిన్...' సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తారని జగన్ వివరించారు.