: ఒబామా ఇంతవరకూ ఎరుగని బహుమతులు అందించిన మోదీ


భారత పర్యటనకు వచ్చిన ఒబామా ఎనలేని జ్ఞాపకాలతో పాటు తాను ఇంతవరకూ ఎరుగని తీపి బహుమతులను వెంట తీసుకువెళ్లారు. ఒబామాకు ఇచ్చిన బహుమతుల వివరాలను మోదీ సోషల్ మీడియాలో వెల్లడించారు. 1957లో భారత పర్యటనకు వచ్చిన అమెరికన్ సింగర్ మరియన్ ఆండర్సన్ ఇక్కడ పాడిన గీతాల రికార్డులను మోదీ స్వయంగా ఒబామాకు అందించారు. ఆ సమయంలో ఆకాశవాణిలో ప్రసారం అయిన ఆండర్సన్ ఇంటర్వ్యూ, గాంధీ స్మారకార్థం ఆయన పాడిన 'లీడ్ కైండ్లీ లైట్' గీతం రికార్డు కూడా బహుమతిగా ఇచ్చారు. అమెరికా నుంచి తొలిసారి ఇండియాకు వచ్చిన టెలిగ్రామ్ ఒరిజినల్ కాపీ ఆయనకు అందించినట్టు పేర్కొన్నారు. వీటితో పాటు 1950 జనవరి 26న విడుదలైన స్టాంప్, విలువైన చీరలు, పలు బహుమతులను ఒబామా తన వెంట తీసుకువెళ్లారు.

  • Loading...

More Telugu News