: నేను భారతరత్నకు తగను: దీదీ అభిప్రాయంతో విభేదించిన అమితాబ్
అమితాబ్ బచ్చన్ కు పద్మవిభూషణ్ బదులు 'భారతరత్న' ఇవ్వాలంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొనడం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై అమితాబ్ ట్విట్టర్లో స్పందించారు. తాను అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న'కు తగనంటూ దీదీతో సున్నితంగా విభేదించారు. దేశం తనకు ఇచ్చిన దాని పట్ల ఎంతో సంతోషిస్తున్నానని, 'భారతరత్న' వంటి పురస్కారాలకు తాను అర్హుడిని కానని తెలిపారు. అంతకుముందు మమత... అమితాబ్ బచ్చన్ వంటి లెజెండ్ కు పద్మవిభూషణ్ సరిపోదని, ఆ స్థాయి వ్యక్తులకు 'భారతరత్న' ఇవ్వాలని పరోక్షంగా డిమాండ్ చేశారు.