: మురిసిపోతున్న షారుఖ్ ఖాన్, మేరీకోం... ఒబామా ఎఫెక్ట్


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. సిరి ఫోర్ట్ ఆడిటోరియంలో తన ప్రసంగం సమయంలో ఒబామా 'దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే' చిత్రంలోని డైలాగు చెప్పడంతో పాటు ఒంటి రంగును చూడకుండా షారుఖ్ ఖాన్, మేరీకోం, మిల్కా సింగ్, కైలాష్ సత్యార్థిల విజయాలను సమానంగా సెలబ్రేట్ చేసుకోవాలని సూచించారు. దీనిపై షారుఖ్ స్పందించారు. ఒబామా స్ఫూర్తిదాయక ప్రసంగంలో తనను ప్రస్తావించినందుకు గర్విస్తున్నానని ట్వీట్ చేశారు. అటు, స్టార్ బాక్సర్ మేరీ కోమ్ కూడా ఒబామా వ్యాఖ్యపై స్పందించింది. అమెరికా అధ్యక్షుడు తన పేరును ప్రస్తావించిన క్షణం గర్వంగా అనిపించిందని తెలిపింది. ఎప్పుడైనా ఆయనను కలిస్తే, కచ్చితంగా థాంక్స్ చెబుతానని, ఆయన ప్రశంస ఎంతో ప్రోత్సాహకరమని పేర్కొంది.

  • Loading...

More Telugu News