: కృష్ణానది ఒడ్డున కాంగ్రెస్ కార్యాలయాన్ని నిర్మిస్తాం: దేవినేని నెహ్రూ
నవ్యాంధ్ర రాజధాని విజయవాడ సమీపంలోని తాడేపల్లి వద్ద కృష్ణా కరకట్ట పక్కన బీజేపీ కార్యాలయ నిర్మాణానికి కొన్నిరోజుల కిందట శంకుస్థాపన జరిగింది. దీనిపై కాంగ్రెస్ మండిపడుతోంది. నిబంధనలకు విరుద్ధంగా బీజేపీ ఆఫీసు నిర్మిస్తే, కృష్ణానది ఒడ్డున కాంగ్రెస్ కార్యాలయాన్ని కూడా నిర్మిస్తామని ఏపీ పీసీసీ కార్యదర్శి దేవినేని నెహ్రూ అంటున్నారు. కృష్ణానదిని ప్రక్షాళన చేయాలని కోరారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ ను పొగుడుతుంటే, ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం జపాన్, సింగపూర్ లను కీర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. శిక్షణకోసం ఉద్యోగులను జపాన్, సింగపూర్ పంపించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.