: ఇంజినీరింగ్ స్టూడెంట్లతో పవన్ కల్యాణ్ 'స్వచ్ఛ భారత్'
ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా రాజాంలో పర్యటిస్తున్నారు. ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు ఆయన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో పాల్గొంటారు. జీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతో కలిసి ఆయన చీపురు పడతారు. పవన్ 'స్వచ్ఛ భారత్'పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. ఈ మెగా హీరోను ప్రధాని నరేంద్ర మోదీ 'స్వచ్ఛ భారత్ అభియాన్'కు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, పవన్ కల్యాణ్ ఈ ఉదయం రాజాంలోని వరలక్ష్మి జీఎంఆర్ కేర్ ఆసుపత్రిని సందర్శించారు.