: ఢిల్లీని ప్రపంచస్థాయి నగరంగా చేస్తానంటున్న కిరణ్ బేడీ
ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ ప్రజలకు హామీల మీద హామీలు గుప్పిస్తున్నారు. ముందు ఢిల్లీ ప్రజలకు సమర్ధమంతమైన, ఆదర్శప్రాయమైన పాలనను అందిస్తానని బేడీ తెలిపారు. తాజాగా, రాజధానిని వరల్డ్ క్లాస్ నగరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. అదే తన ప్రథమ కర్తవ్యమని చెప్పారు. "ఢిల్లీని ప్రపంచస్థాయి నగరంగా రూపొందించడమే నా ప్రథమ ప్రాధాన్యతల్లో ఒకటి. అందరికీ ఉత్తమమైన జీవితాన్ని కల్పించే మౌలిక సదుపాయాలు తీసుకువస్తాము" అని ట్విట్టర్ లో బేడీ పేర్కొన్నారు.