: ఈసారి డ్యాన్స్ చేయలేకపోయాం: ఒబామా
తన సతీమణి మిషెల్ మంచి డ్యాన్సర్ అని పొగిడిన ఒబామా, ఇండియాలో నృత్యం చేసే అవకాశం ఈ దఫా తనకు లభించలేదని అన్నారు. న్యూఢిల్లీలోని సిరిఫోర్ట్ లో ఒబామా ప్రసంగిస్తూ గత పర్యటనను గుర్తుచేసుకున్నారు. జైహింద్ అంటూ ప్రసంగాన్ని ముగించిన ఆయన "గతంలో ఇండియాకు వచ్చినపుడు మేము ముంబైలో పిల్లలతో కలిసి డ్యాన్సు చేశాం. దురదృష్టవశాత్తు ఈసారి చేయలేకపోయాం. కానీ, గత సంవత్సరం వైట్ హైస్ లో దీపావళి పండగ ఘనంగా జరుపుకున్నాం" అని తెలిపారు.