: వైట్ హౌస్ కు రండి... మా ఆతిథ్యం స్వీకరించండి: రాయపాటికి ఒబామా ఆహ్వానం


గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావుకు అరుదైన ఆహ్వానం లభించింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రాయపాటిని వైట్ హౌస్ కు రమ్మని ఆహ్వానించారు. భారత పర్యటనకు వచ్చిన ఒబామాను నిన్న రాష్ట్రపతి భవన్ లో రాయపాటి కలిశారు. ఈ సందర్భంగా రాయపాటి తిరుపతి లడ్డూతో పాటు అపురూపమైన ముత్యాల హారాన్ని ఒబామా దంపతులకు అందజేశారు. దీంతో, రాయపాటికి కృతజ్ఞతలు తెలిపిన ఒబామా దంపతులు, వైట్ హౌస్ కు వచ్చి తమ ఆతిథ్యాన్ని స్వీకరించాలని కోరారు. 2010లోనూ భారత్ వచ్చిన ఒబామాకు బంగారంతో చేసిన అరుదైన రుద్రాక్ష హారాన్ని రాయపాటి బహుమతిగా అందజేశారు. తాజాగా ఒబామా ఆహ్వానం అందుకున్న రాయపాటి... ఇప్పటిదాకా ఆరుసార్లు అమెరికా వెళ్లానని, ఈసారి జరిపే పర్యటన ప్రత్యేకమైనదని మీడియాకు చెప్పారు.

  • Loading...

More Telugu News