: స్వైన్ ఫ్లూ మహమ్మారికి మరో మహిళ మృతి... తెలంగాణలో 23కు చేరిన మృతుల సంఖ్య
తెలంగాణలో స్వైన్ ఫ్లూ విస్తరిస్తూనే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో 22 మందిని పొట్టనబెట్టుకున్న ఈ వైరస్, నేటి ఉదయం మరో మహిళను బలిగొంది. స్వైన్ ఫ్లూ వైరస్ సోకిన రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ మండలం ఏదులాబాద్ కు చెందిన వివాహిత శైలజ నేటి ఉదయం చనిపోయింది. స్వైన్ ఫ్లూ బారినపడిన ఆమెను కుటుంబసభ్యులు హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. శైలజ మరణంతో రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మరణాలు 23కు చేరుకున్నాయి.