: స్పెయిన్ లో రెండు విమానాలు ఢీ
స్పెయిన్ లోని లాస్ లానోస్ వైమానిక స్థావరంలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక యుద్ధ విమానాన్ని మరో శిక్షణా విమానం ఢీ కొట్టింది. గ్రీక్ కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానం మరో విమానాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో మొత్తం 10 మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. వైమానిక స్థావరంలో నాటో శిక్షణ జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నట్టు అధికారులు తెలిపారు.