: అనంతలో బస్సు-లారీ ఢీ... 14 మందికి గాయాలు


అనంతపురం జిల్లాలో కొద్దిసేపటి క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. జిల్లాలోని విడపనకల్ వద్ద ఎదురుగా వస్తున్న బస్సును ఓ లారీ ఢీకొంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే స్పందించారు. హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాత్రులను విడపనకల్, ఉరవకొండ ఆస్పత్రులకు తరలించారు. వీరికి ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబందించిన పూర్తి వివరాలు తెలియరాలేదు.

  • Loading...

More Telugu News