: లండన్ లో ప్రదర్శన నిర్వహించిన తొలి భారత కార్టూనిస్టు లక్ష్మణే!
భారతదేశం గర్వించదగ్గ కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్ కన్నుమూయడం తెలిసిందే. ఆయన పేరిట ఎన్నో ఘనతలున్నాయి. లండన్ లో ప్రదర్శన నిర్వహించిన తొలి భారత కార్టూనిస్టు లక్ష్మణే. ఆయన ప్రతిభకు నిదర్శనంలా ఎన్నో విశిష్ట పురస్కారాలు వరించాయి. 2005లో పద్మ విభూషణ్ అందుకున్నారు. 1971లో పద్మభూషణ్ వరించింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసె అవార్డును 1984లో అందుకున్నారు. ఆయన ఆత్మకథ 'టన్నెల్ ఆఫ్ టైమ్' మరాఠీలో లక్ష్మణ్ రేఖ పేరిట ప్రచురితమైంది. లక్ష్మణ్ లో కార్టూనిస్టే కాదు మంచి రచయిత కూడా ఉన్నాడు. 'హోటల్ రివేరా', 'ద మెసెంజర్', 'సర్వెంట్స్ ఆఫ్ ఇండియా' పుస్తకాలు రచించారు.