: ఆధునిక వాణిజ్య విధానాలపై నాకూ, మోదీకి ఆసక్తి ఉంది: ఒబామా


భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఢిల్లీలోని హోటల్ తాజ్ ప్యాలెస్ లో భారత్-అమెరికా సీఈఓల సదస్సులో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఈ సదస్సుకు హాజరైన ఒబామా మాట్లాడుతూ, ఆధునిక వాణిజ్య విధానాలపై తనకూ, భారత ప్రధాని మోదీకి ఆసక్తి ఉందని అన్నారు. భారత్ లో అద్భుతమైన నైపుణ్యం కలిగిన వ్యాపారం విస్తరించి ఉందని పేర్కొన్నారు. భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య రంగంలో 60 శాతం వృద్ధి సాధించామని, రెండు దేశాల మధ్య వాణిజ్య రంగంలో అభివృద్ధి శుభపరిణామమని అభివర్ణించారు. వాణిజ్యం, పెట్టుబడుల్లో మరింత అభివృద్ధి సాధించాలన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు. వాణిజ్యం, పెట్టుబడుల్లో పురోగతి వల్ల రెండు దేశాల ప్రజలకు లాభమేనని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News