: న్యూజిలాండులో తెలుగు వ్యక్తి దుర్మరణం


న్యూజిలాండులో జరిగిన రోడ్డు ప్రమాదంలో వైజాగ్ కు చెందిన చెరుకూరి సంతోష్ కుమార్ (27) అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పహోయియా వద్ద రెండో నెంబర్ రాష్ట్ర రహదారిపై జరిగిన దుర్ఘటనలో సంతోష్ కుమార్ అక్కడికక్కడే మరణించినట్టు తెలుస్తోంది. సంతోష్ గురువారం నాడు మరో ఐదుగురితో కలిసి తౌరాంగా నుంచి ఆక్లాండ్ తిరిగి వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న కారు ఓ ట్రక్ ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో సంతోష్ కుమార్ తీవ్రగాయాలతో ప్రాణాలు విడిచాడు. సంతోష్ మిత్రులు, ట్రక్ డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన గురించిన వివరాలు సోమవారం వెలుగులోకి వచ్చాయి. సంతోష్ మృతదేహాన్ని భారత్ కు త్వరితగతిన రప్పించేందుకు చర్యలు తీసుకోవాలంటూ అతని తల్లిదండ్రులు, మిత్రులు విశాఖ కమిషనర్ అమిత్ గార్గ్, జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ లను కోరారు. 2012లో సంతోష్ కుమార్ ఎంబీఏ చదివేందుకు న్యూజిలాండ్ వెళ్లాడు. విద్యాభ్యాసం అనంతరం అక్కడే ఆక్లాండ్ లో ఓ సూపర్ ఫుడ్స్ సంస్థలో అకౌంట్స్ మేనేజర్ గా చేరాడు.

  • Loading...

More Telugu News