: కేసీఆర్, రామోజీరావు మధ్య చీకటి ఒప్పందం కుదిరింది: మధుయాష్కీ


మాజీ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ నేత మధుయాష్కీగౌడ్ సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, ఈనాడు గ్రూపు అధినేత రామోజీరావు మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. అంతేగాకుండా, మెడికల్ సీట్ల కోసం కేసీఆర్ కుటుంబానికి రూ.1000 కోట్లు ముడుపుల రూపంలో అందాయని అన్నారు. హెల్త్ స్కాంలో ఉన్నది ఎవరో కేసీఆర్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. చివరికి రాజయ్యను బలిపశువును చేశారని విమర్శించారు. టీఆర్ఎస్ నేతలకు భయపడి పనులు చేస్తున్న అధికారులు చివరికి జైలుకు పోవాల్సి వస్తుందని ఈ నిజామాబాద్ మాజీ ఎంపీ హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తలకు టీఆర్ఎస్ నేతల నుంచి బెదిరింపులు వస్తున్నాయని అన్నారు.

  • Loading...

More Telugu News