: రాష్ట్రపతి భవన్ లో ఒబామాకు 'టీ పార్టీ'
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన అర్ధాంగి మిషెల్ తో కలిసి 'ఎట్ హోం' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 'టీ పార్టీ' ఇచ్చారు. 'ఎట్ హోం' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. పలువురితో కరచాలనం చేస్తూ ఒబామా ఉత్సాహంగా కనిపించారు. అటు, తమ దేశ దౌత్యాధికారులతోనూ సీరియస్ గా మాట్లాడుతూ దర్శనమిచ్చారు. కాగా, వివిధ రంగాలకు చెందిన వ్యక్తులకు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం కల్పించారు. అయితే, వారిని ఒబామా సమీపానికి వచ్చేందుకు మాత్రం అనుమతించలేదు. వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బారికేడ్ల అవతలే ఉంచారు.