: ఒబామాను కలిసిన సోనియా, రాహుల్
భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె తనయుడు, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కలిశారు. ఢిల్లీలోని హోటల్ మౌర్య షెరాటన్ హోటల్ లో బస చేసిన ఒబామాతో వారు భేటీ అయ్యారు. భారత్ స్థితిగతులు, అంతర్జాతీయ పరిణామాలు వారి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఒబామా ఈ సాయంత్రం హోటల్ తాజ్ ప్యాలెస్ లో జరిగే భారత్-అమెరికా సీఈవోల ఫోరం సమావేశానికి హాజరవుతారు.