: స్వైన్ ఫ్లూపై తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ కొత్త మంత్రి సమీక్ష
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నూతన మంత్రిగా బాధ్యతలు తీసుకున్న లక్ష్మారెడ్డి ఈరోజు గాంధీ ఆసుపత్రికి వెళ్లారు. తొలిసారి స్వైన్ ఫ్లూ వార్డును సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. తరువాత ఆసుపత్రి వైద్యులతో స్వైన్ ఫ్లూపై పరిస్థితిని సమీక్షించారు. వార్డులో శుభ్రత పాటించాలని, వ్యాధి నయం అయ్యేవరకు రోగులు ఆసుపత్రి వదిలి వెళ్లకుండా చూడాలని మంత్రి వైద్యులకు సూచించారు. మాజీ మంత్రి రాజయ్యను భర్తరఫ్ చేయడంతో ఆయన స్థానంలో లక్ష్మారెడ్డిని మంత్రిని చేసిన సంగతి తెలిసిందే.