: వేములవాడలో ఆలయం వద్ద అదుపుతప్పిన కోడెలు... భక్తులకు గాయాలు


ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడలోని రాజరాజేశ్వరీ ఆలయం వద్ద దాతలు సమర్పించిన కోడెలు ఒక్కసారిగా అదుపుతప్పి రంకెలు వేసాయి. భక్తులపై పడి కొమ్ములతో పొడిచాయి. దీంతో, ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. కోడెల దూకుడుకు ఆలయంలోని ఇద్దరు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన దేవాలయ సిబ్బంది కోడెలను అదుపు చేసి వాటిని అక్కడినుంచి తరలించారు. గాయపడిన భక్తులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కోడెలు అదుపు తప్పడానికి కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News