: ఏపీ కేబినెట్ భేటీ వాయిదా
రేపు జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ వాయిదా పడింది. ఫిబ్రవరి 2న సమావేశం జరుగుతుందని శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం జరిపారు. మూడు రోజుల తన దావోస్ పర్యటన విశేషాలు, ప్రధానంగా పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే విషయంపై జరిపిన చర్చలు, నవ్యాంధ్ర రాజధానిలో భూ సమీకరణ అంశాలపై ప్రధానంగా చర్చించారు. దాదాపు నలభై నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది.