: టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే స్వైన్ ఫ్లూ: పొన్నాల
టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తెలంగాణలో స్వైన్ ఫ్లూ ప్రబలిందని ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా స్వైన్ ఫ్లూ సాకుతో దళిత మంత్రిని బలిపశువు చేశారని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుని ఫ్లూను అరికట్టిందని పొన్నాల చెప్పారు. గాంధీ భవన్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, దేశంలో రాజ్యాంగ స్ఫూర్తి, లౌకికవాదాన్ని నరేంద్రమోదీ ప్రభుత్వం పూర్తిగా దెబ్బతీసిందని వ్యాఖ్యానించారు.