: ఆద్యంతం అత్యద్భుతం... ఒబామా ముందు భారత్ సైనిక పాటవం ప్రదర్శన


భారత సైనిక శక్తి ఎటువంటిదో అగ్రరాజ్యాధినేత స్వయంగా తిలకించారు. మన వద్ద ఎటువంటి ఆయుధాలు ఉన్నాయో ఆయనకు తెలిసింది. అత్యాధునిక యుద్ధ ట్యాంకులు, ఒకేసారి 12 మిసైళ్ళను గాల్లోకి ప్రయోగించి విమానాలను ధ్వంసం చేయగల మల్టీ మిసైల్ లాంచర్లు, ఖండాంతర క్షిపణులు, తేలికపాటి ఆయుధాలు, భారీ విధ్వంసం సృష్టించగల బాంబర్లు ప్రదర్శనలో భాగం అయ్యాయి. ఆ తరువాత వివిధ విభాగాలకు చెందిన సైనికులు పరేడ్ నిర్వహించారు. తొలిసారిగా మహిళలు ఈ ప్రదర్శనలో భాగం కావడంతో, ప్రజలు చప్పట్ల హోరుతో వారికి స్వాగతం పలికారు. డీఆర్డీఓ తయారు చేసిన ఆకాష్, అగ్ని తదితర క్షిపణులు అందరినీ అలరించాయి. అంతకుముందు షోపియాన్‌ లో ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందిన ముకుంద్ వరదరాజన్, కుప్వారా జిల్లాలో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన నాయక్ నీరజ్‌ కుమార్ కుటుంబ సభ్యులకు అశోక చక్ర పురస్కారాలను రాష్ట్రపతి అందించారు.

  • Loading...

More Telugu News