: తెలంగాణభవన్‌ లో గణతంత్ర వేడుకలు


తెలంగాణ భవన్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయిని ప్రసంగిస్తూ, అమరవీరుల త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నింటినీ నెరవేరుస్తున్నామని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ కలను సాకారం చేస్తామని వివరించారు.

  • Loading...

More Telugu News