: మరి కాసేపట్లో హైదరాబాదులో గణతంత్ర వేడుకలు... భారీ భద్రత


మరి కాసేపట్లో హైదరాబాదులోని పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ తొలి గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉగ్రవాదం, హైదరాబాద్‌లో ఐఎస్‌ఐఎస్ కదలికలు, కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భద్రతను మరింత పటిష్టం చేశారు. వేడుకలు జరిగే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో మూడంచెలతో భద్రతను పకడ్బందీగా ఏర్పాటు చేశారు. వేడుకల ప్రాంగణాన్ని తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు అడుగడుగునా తనిఖీలు నిర్వహించారు. రాష్ట్ర పోలీసు సిబ్బందితోపాటు కేంద్ర బలగాలను కూడా భారీగా మోహరించారు. పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను ఆధునికీకరించారు. ప్రధాన మార్గాల్లో నాకా బందీలు నిర్వహించడంతో పాటు ఏమాత్రం అనుమానాస్పదంగా కనిపించినా వారిని అదుపులోకి తీసుకుని వివరాలు సేకరిస్తున్నారు.

  • Loading...

More Telugu News