: నిజామాబాద్ జిల్లాలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం... ఉద్రిక్తత
నిజామాబాద్ జిల్లాలోని మోర్తాడ్ మండలం, ఏరుగట్ల గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కోసం సోమవారం ఉదయం విగ్రహం వద్దకు చేరుకున్న గ్రామస్తులు ముఖం, చేయి భాగంలో విరిగి ఉండటాన్ని గుర్తించి ఆందోళనకు దిగారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు నిందితులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. గ్రామస్తుల ధర్నాతో గంటకు పైగా ట్రాఫిక్ నిలిచినట్టు సమాచారం.