: శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ ప్రతి జిల్లాలో విమానాశ్రయం : గవర్నర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ ప్రతి జిల్లాలో విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి వుందని గవర్నర్ నరసింహన్ తెలిపారు. నవ్యాంధ్ర తొలి గణతంత్ర వేడుకల్లో ఆయన ప్రసంగించారు. ప్రజల జీవన విధానాన్ని మరింత మెరుగు పరచేందుకు, రాకపోకలను సులువు చేసేందుకు, కొత్త ఉద్యోగాల సృష్టికి ఇవి ఉపయోగపడతాయని ఆయన అన్నారు. నగరాలు, పట్టణాలతో పాటు ఏ ఒక్క గ్రామంలో కూడా కరెంట్ కోత అనే మాటే వినపడకుండా చేసిన ఘనత తన ప్రభుత్వానిదేనని నరసింహన్ వివరించారు. సమాజంలో అన్ని వర్గాల వారికీ మేలు చేకూర్చే నిర్ణయాలనే తీసుకుంటూ, అభివృద్ధి దిశగా సాగుతున్నట్టు తెలిపారు.