: నా దైవమే నాకు అన్యాయం చేసింది: మీడియా ముందు వాపోయిన రాజయ్య


తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు తనకు దైవంతో సమానమని, ఆ దైవమే తనకు అన్యాయం చేసిందని మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. నిన్న రాజయ్యను మంత్రివర్గం నుంచి తప్పించిన తరువాత రాత్రి పొద్దుపోయాక ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తనను తండ్రిలా ప్రోత్సహించారని, ఊహించని విధంగా తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవించారని గుర్తుచేసుకున్నారు. వైద్యశాఖ ప్రక్షాళన కోసం ఎంతో కృషి చేశానని రాజయ్య చెప్పారు. వైద్య రంగానికి సంబంధించి తాను చేసిన పనుల ఫలితాలు త్వరలోనే కనిపిస్తాయని అన్నారు. త్వరలోనే తాను కేసీఆర్ను కలిసి మాట్లాడతానని చెప్పారు.

  • Loading...

More Telugu News