: హైవేపై పది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్


నల్గొండ జిల్లా మునగాల మండలంలోని ముకుందాపురం గ్రామం వద్ద భారీ ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. సుమారు పది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముుకుందాపురం దగ్గర ఈ ఉదయం యాక్సిడెంట్ జరిగింది. దీంతో గ్రామస్థులు ఆగ్రహించి రాస్తారోకో నిర్వహించారు. గ్రామస్థులను పోలీసులు సముదాయించి పంపేశారు. మళ్లీ సాయంత్రం అదే ప్రాంతంలో ఓ వృద్ధురాలిని కారు 'ఢీ' కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడ మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు రోడ్డుపై రాళ్లు, ముళ్ల కంపలు పెట్టి, రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో చేపట్టారు. దీంతో జాతీయ రహదారిపై సుమారు పది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

  • Loading...

More Telugu News