: నిరాడంబరంగా సినీ నటి, యువరాణి వివాహం
మధ్యప్రదేశ్ లోని పటౌడీ యువరాణి, సినీ నటి సోహా అలీఖాన్, నటుడు కునాల్ ఖేముల వివాహం నిరాడంబరంగా జరిగింది. ఖార్ లోని పటౌడీల నివాసంలో కొద్ది మంది ఆత్మీయ అతిథుల సమక్షంలో సాదాసీదాగా ఈ వివాహం జరిగింది. రిజిస్ట్రార్, సోహా తల్లి షర్మిలా ఠాగూర్, సోదరుడు సైఫ్ అలీఖాన్, వదిన కరీనా కపూర్, స్నేహితురాలు నేహా ధూపియా, మరికొంత మంది సన్నిహితులు ఈ వివాహంలో పాలు పంచుకున్నారు. కాగా, సోహా, కునాల్ ల నిశ్చితార్థం గత ఏడాది పారిస్‌లో జరిగింది. కునాల్ ఖేము, సోహా అలీఖాన్ కన్నా ఐదేళ్లు చిన్నవాడు. 'రంగ్ దె బసంతి' ఫేమ్, తెలుగు హీరో సిద్ధార్థ్ తో బంధం బెడిసికొట్టిన తరువాత, వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, సుదీర్ఘకాలం కొనసాగిన లివ్ ఇన్ రిలేషన్ పెళ్లి వరకు నడిచిందని బాలీవుడ్ టాక్. వీరిద్దరూ '99' అనే సినిమాలో జంటగా నటించారు. తెల్లని ఆఫ్ వైట్ లెహంగా చోలీ ధరించిన సోహా అలీ ఖాన్ పెళ్లికుమార్తె అలంకరణతో కళకళలాడింది.