: మోదీతో ఏకీభవిస్తున్నా: ఒబామా
మోదీ చెప్పిన దానితో తాను ఏకీభవిస్తున్నానని ఒబామా తెలిపారు. తామిద్దరం వ్యక్తులం కాదని, తామిద్దరం రెండు దేశాలకు ప్రతినిధులమని అన్నారు. తాము మాట్లాడుకునేటప్పుడు రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల ప్రజలు మాట్లాడుకుంటున్నట్టని అన్నారు. తాను మోదీ ఉత్సాహాన్ని చూసి ఆశ్చర్యపోతుంటానని ఆయన చెప్పారు. తమ వ్యవహార శైలి ద్వారా అభిమానం వ్యక్తం చేస్తామని ఆయన వెల్లడించారు.