: భారత్, అమెరికా పౌర అణు ఒప్పందంపై తొలగిన అనిశ్చితి


భారత్, అమెరికాల మధ్య చాలా కాలంగా పెండింగులో ఉన్న పౌర అణు ఒప్పందానికి సూత్రప్రాయ అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది. ఒబామా పర్యటన సందర్భంగా దీనిపై ఒక స్పష్టత వస్తుందని విశ్లేషకులు అంచనా వేసిన సంగతి తెలిసిందే. పౌర అణుఒప్పందంలో అత్యంత ముఖ్యమైన 'ట్రాకింగ్ క్లాజు'ను తొలగించేందుకు అమెరికా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది. దీని ప్రకారం భారత అణు ఉపయోగాన్ని తాము పరిశీలించబోమని అమెరికా చెప్పడమే అవుతుంది. పౌర అణు ఒప్పందానికి కీలక అడ్డంకిని ఒబామా తన విశేషాధికారాలతో తొలగించినట్టు తెలుస్తోంది. ఇతర దేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకునే అణు సామగ్రిని అమెరికా కంపెనీలు సరఫరా చేసిన రియాక్టర్లలో ఎలా వినియోగిస్తున్నారో అమెరికా తెలుకునేందుకు ప్రయత్నించదు. భారతీయ చట్టాల ప్రకారమే అణుఒప్పందానికి సిద్ధమవడం అమెరికా భారత్ తో ఎలాంటి బంధాన్ని కోరుకుంటోందో తెలియజేస్తోంది. దీంతో అణు ఒప్పందంపై సుదీర్ఘ కాలంగా నెలకొన్న అనిశ్చితి తొలగనుంది.

  • Loading...

More Telugu News