: తెలంగాణ ఉపముఖ్యమంత్రి రాజయ్య రాజీనామా
తెలంగాణ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య రాజీనామా చేశారు. స్వైన్ ఫ్లూ పై సమర్థవంతమైన పోరాటం చేయలేదనే ఆరోపణల నేపథ్యంలో ఊహించని విధంగా తెలంగాణ ఉపముఖ్యమంత్రి రాజయ్యను తొలగించారు. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఆయనను యుద్ధప్రాతిపదికన తొలగించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగి, సహచరులకు నచ్చజెప్పారు. దీంతో ఆయనను పదవికి రాజీనామా చేయాలని ఆదేశించారు. దీంతో ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్ తో మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ భేటీ అయ్యారు. ఆయన రాజీనామా విషయాన్ని చెప్పారు. దీంతో ఆయన రాజీనామాకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు.