: నిర్దోషిని 37 ఏళ్ల పాటు జైలులో ఉంచిన అమెరికా ప్రభుత్వం!
తాను చేయని నేరానికి 37 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించిన జోసఫ్ స్లెడ్జ్ అనే అమెరికన్ పౌరుడు జైలు నుంచి విడుదలయ్యాడు. ఇప్పటికి తనను దేవుడు కరుణించాడని జైలు నుంచి విడుదలైన తర్వాత జోసఫ్ వ్యాఖ్యానించాడు. 1978లో జోసఫ్ ఓ కారును దొంగతనం చేసి పారిపోతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై హత్యానేరం మోపారు. ఇద్దరిని హత్య చేసినట్లు చెప్పారు. కోర్టు యావజ్జీవ జైలుశిక్ష విధించింది. ఈ కేసులో తాను నిర్దోషినని జోసఫ్ వాదించినా లాభంలేకపోయింది. ఇన్నాళ్లకి అతడి నిర్దోషిత్వం నిరూపితం కావడంతో కొలంబస్ కౌంటీ జైలు నుంచి విడుదలయ్యాడు. అతని భావి జీవనానికి అయ్యే ఖర్చును ఇప్పుడు అమెరికా ప్రభుత్వమే భరించనుంది.