: ఇరవై కోట్ల చీరలు కావాలి: మోదీ


"వచ్చే ఇరవై ఏళ్లలో 20 కోట్ల మంది యువతులు వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతారు. వాళ్లందరి కోసం ఇరవై కోట్ల చీరలు అవసరమవుతాయి. ఇంతటి పెద్ద మార్కెట్ మీ కోసం ఎదురుచూస్తోంది. అవకాశాలను అందిపుచ్చుకోండి'' అని వస్త్ర వ్యాపారులనుద్దేశించి మోడీ వ్యాఖ్యానించారు. ఈ-కామర్స్ ను ఉపయోగించుకొని ప్రపంచ మార్కెట్ లో ఇండియా వ్యాపారాలు ప్రధాన భూమిక పోషించాలని ఆయన కోరారు. ఈ కామర్స్ రంగంలో సృజనాత్మకతను, టెక్నాలజీని ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు. వ్యాపారులు తమతమ ఉత్పత్తులలో నాణ్యతను పెంచి, మంచి డిజైన్లు రూపొందించాలని ఆయన ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News