: కాస్త కనికరించిన బోకో హరామ్ తీవ్రవాదులు... 192 మంది బందీల విడుదల
బోకో హరామ్ తీవ్రవాదులు తమవద్ద వున్న బందీలపై కాస్తంత కనికరం చూపారు. తీవ్రవాదులు అపహరించిన వారిలో దాదాపు 192 మంది బందీలను విడుదల చేశారని నైజీరియా సైనిక ఉన్నతాధికారులు నేడు వెల్లడించారు. విడుదలైన వారిలో అత్యధికులు మహిళలు, చిన్నారులు ఉన్నారని తెలిపారు. తీవ్రవాదులు రెండు ట్రక్కుల్లో బందీలను డమత్తురు సమీపంలోని గిర్భువా గ్రామంలో విడిచిపెట్టారని పేర్కొన్నారు. జనవరి మొదటి వారంలో నైజీరియా ఈశాన్య ప్రాంతంలోని యొబో గ్రామం నుంచి 218 మందిని బోకో హరామ్ తీవ్రవాదులు అపహరించిన సంగతి తెలిసిందే. అంతకుముందు వారు ఆయుధాలతో వచ్చి కట్రాకో గ్రామంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. గ్రామంలోని మహిళలు, చిన్నారులను కిడ్నాప్ చేశారు.