: సీఎం చెప్పినా వినని అధికారులు... ఇంకెవరు చెప్పాలో!


తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల వరంగల్‌లో పర్యటించిన సందర్భంగా అర్హులకు పింఛన్లు, ఆహార భద్రత కార్డులు అందజేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో లక్ష్మీపురానికి చెందిన ప్రవీణ్‌ కుమార్ అనే వ్యక్తి వచ్చి కేసీఆర్ ముందు తన బాధలు చెప్పుకున్నాడు. వెంటనే స్పందించిన సీఎం ప్రవీణ్‌ ఆహార భద్రత కార్డు పొందేందుకు అర్హుడని ప్రకటించి మంజూరు పత్రాన్ని స్వయంగా అందించారు. అయితే, తాజాగా విడుదలైన జాబితాలో ప్రవీణ్‌ పేరు లేకపోవడంతో ఆయన అవాక్కయ్యాడు. సీఎం మంజూరు చేసినా, అర్హుల జాబితాలో పేరు లేకపోవడంతో కంగుతిన్నాడు. దీంతో, వరంగల్ తహసీల్దార్ కార్యాలయానికి మరోసారి వెళ్లి మళ్లీ దరఖాస్తు చేసుకున్నాడు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పినా వినని అధికారులు ఇంకెవరు చెబితే వింటారో?!

  • Loading...

More Telugu News