: ఒబామాను కలిసేందుకు చంద్రబాబుకు ఆహ్వానం... వెళ్లే అవకాశాలు మాత్రం లేనట్టే!


ఒబామాకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఇవ్వనున్న విందుకు హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం అందినట్టు తెలిసింది. ఆదివారం రాత్రి ఒబామా గౌరవార్థం రాష్ట్రపతి విందు ఇస్తున్న సంగతి తెలిసిందే. నేడు, రేపు ఒబామాకు ఇచ్చే విందుకు రావాలని చంద్రబాబుకు ఆహ్వానం అందగా, గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు ఉన్నందున ఆయన ఢిల్లీ వెళ్లే అవకాశాలు లేవని సమాచారం. కాగా, ప్రత్యేకంగా ఒబామాను కలిసేందుకు చంద్రబాబుకు అపాయింట్ మెంట్ లభించని సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News