: ఒబామా పర్యటన నేపథ్యంలో వెలుగు చూసిన పచ్చి నిజం!


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రాక పుణ్యమాని భారతీయులకు, అందునా న్యూఢిల్లీ వాసులకు ఒక పచ్చి నిజం తెలిసింది. ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ఏ స్థాయిలో ఉందో స్పష్టమైంది. ఒబామా పర్యటన జరిగే ఆరు ప్రాంతాల్లో వాయు కాలుష్యం ఎలా వుందో పరిశీలించిన అమెరికా అధికారులు విస్తుపోయే నిజాలు వెల్లడించారు. భారత భద్రతా ప్రమాణాలకంటే మూడు రెట్లు అధిక కాలుష్యం ఢిల్లీలో ఉందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకంటే ఇది తొమ్మిది రెట్లు ఎక్కువని గ్రీన్‌ పీస్ ఇండియా పేర్కొంది. ఒబామా సందర్శించనున్న జనపథ్‌ లో 2.5 మైక్రో మీటర్ల కంటే తక్కువ ఉన్న రేణువుల (పీఎం2.5) గరిష్ట స్థాయి క్యూబిక్ మీటరుకు 264 మైక్రో గ్రాములుగా ఉండగా, రద్దీగా ఉండే హైదరాబాద్ హౌస్ వద్ద 239, రాజ్‌ ఘాట్ వద్ద 229 మైక్రో గ్రాములుగా కాలుష్యం ఉందని గ్రీన్‌ పీస్ తెలిసింది. అదన్నమాట సంగతి!

  • Loading...

More Telugu News