: విశాఖపై అమెరికాతో ఒప్పందానికి ఢిల్లీకి సీఎస్
ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ సిటీ విశాఖపట్టణాన్ని స్మార్ట్ సిటీగా రూపొందించే ఒప్పందం అమెరికాతో చేసుకునేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణా రావు ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. విశాఖ స్మార్ట్ సిటీపై రేపు ఢిల్లీలో ఒప్పందం జరగనుంది. విశాఖపట్టణంతో పాటు, అహ్మదాబాద్, పూణెలను కూడా అమెరికా సాయంతో స్మార్ట్ సిటీలుగా నిర్మించనున్నారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడితో రేపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకోనున్నాయి.