: హైదరాబాదులో తనిఖీలు...నెక్లెస్ రోడ్డులో 6 లక్షలు స్వాధీనం


గణతంత్ర వేడుకల నేపథ్యంలో హైదరాబాదులో భద్రతా ఏర్పాట్లు ఊపందుకున్నాయి. పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. కార్టన్ సెర్చ్ ఆపరేషన్లు విస్తృతమయ్యాయి. దీంతో పోలీసులు నగర వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, తనిఖీలు చేపట్టారు. నెక్లెస్ రోడ్డులో చేసిన తనిఖీల్లో ఓ ద్విచక్రవాహనం నుంచి 6 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకుని, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాదులోని తనిఖీల్లో ఒక వ్యక్తి నుంచి 4 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిన్న పాతబస్తీలో చేపట్టిన కార్టన్ సెర్చ్ ఆపరేషన్ లో పోలీసులు 250 మంది బాలలను రక్షించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News