: కేన్సర్ బాధితులు ఆత్మస్థైర్యంతో ఉండాలి: కమల్ హాసన్
కేన్సర్ బాధితులు ఆత్మస్థైర్యంతో ఉండాలని ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ సూచించారు. హైదరాబాదులోని యశోదా ఆసుపత్రిలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సుకు హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేన్సర్ కు వైద్యం అందుబాటులో ఉందని, అత్యాధునిక వైద్యం అందించేందుకు నిరంతర పరిశోధనలు జరుగుతున్నాయని అన్నారు. కేన్సర్ చికిత్సలో సినీ నటి గౌతమి చాలా ధైర్యం చూపించిందని ఆయన ప్రశంసించారు. పేషెంట్లకు మెరుగైన జీవితం అందించేందుకు వైద్యులు ఎంతో కృషి చేస్తున్నారని ఆయన వైద్యులను అభినందించారు.