: బద్రీనాథ్ ఆలయం ఏప్రిల్ లో తెరుచుకోనుంది: ఆలయపెద్దలు


గర్వాల్ హిమాలయాల్లోని హిందూ పవిత్ర దేవాలయం బద్రీనాథ్ ఐదు నెలల తరువాత ఏప్రిల్ 26న తెరుచుకోనుంది. ప్రతిఏటా శీతాకాలం, మంచు కారణంగా ఈ ఆలయాన్ని ఐదు నెలల పాటు మూసివేస్తారు. శీతాకాలం ప్రవేశించిన సందర్భంగా 2014 నవంబర్ 27న మూసేసిన ఈ ఆలయాన్ని ఏప్రిల్ 26 ఉదయం 5.15 గంటలకు భక్తుల కోసం తెరుస్తారని ఆలయ పూజారి పండిట్ ఆచార్య కృష్ణప్రసాద్ ఉనియాల్ తెలిపారు. వసంత పంచమి సందర్భంగా పూజారులు, తేహ్రి రాజకుటుంబ సభ్యులు, డిమ్రి వర్గ ప్రతినిధులు, బద్రీనాథ్- కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ తదితరులంతా కలసి ఆలయాన్ని పునఃదర్శన పవిత్ర ముహూర్తాన్ని నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News