: భారత్ కు బ్రిటన్ ప్రధాని గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
గణతంత్ర దినోత్సవ సందర్భంగా బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ భారత్ కు శుభాకాంక్షలు తెలిపారు. తామిద్దరమూ సమాన భాగస్వామ్యమున్న దేశాలంటూ తన ప్రత్యేక సందేశంలో పేర్కొన్నారు. "ప్రపంచంలోనే అతిపెద్ద, పురాతన ప్రజాస్వామ్య దేశాలైన భారత్, బ్రిటన్ ల మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ సంబంధం ఎన్నో గొప్ప మార్పులకు దారి తీసింది" అని కామెరూన్ పేర్కొన్నట్టు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇరు దేశాల మధ్య సహకారం ఇప్పుడు బలమైన, లోతైన, మరింత సుదూరాలకు చేరుకుందని అభిప్రాయపడ్డారు. పరస్పర గౌరవం, సమాన భాగస్వామ్యమున్న రెండు దేశాల మధ్య సంబంధం ఇదని ప్రకటనలో స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ ఇలాగే ఇద్దరి మధ్య బంధం కొనసాగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.