: ఒబామా పర్యటనలో మార్పులివే


గణతంత్ర వేడుకల ముఖ్య అతిథిగా విచ్చేయనున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. 25వ తేదీ ఉదయం 10:30 గంటలకు ఒబామా భారత్ చేరుకోనున్నారు. రాష్ట్రపతి భవన్ లో లాంఛన స్వాగతం అనంతరం ఒబామా దంపతులు ప్రధాని నరేంద్ర మోదీతో కలసి మహాత్మాగాంధీ సమాధివద్ద శ్రద్ధాంజలి ఘటిస్తారు. అనంతరం ప్రధాని మోదీతో హైదరాబాద్ హౌస్ లో సమావేశమవుతారు. అనంతరం రాష్ట్రపతి భవన్ లో ప్రణబ్ ముఖర్జీతో భేటీ అవుతారు. 26న రాజ్ పథ్ లో జరిగే గణతంత్ర వేడుకల్లో ఆయన పాలుపంచుకుంటారు. 27వ తేదీ ఢిల్లీలోని సిరి ఫోర్ట్ ఆడిటోరియంలో జరగనున్న సమావేశంలో ప్రసంగిస్తారు. 27న ఆగ్రాలో తాజ్ సందర్శనను రద్దు చేసుకుని సౌదీ వెళ్లనున్నారు. నిన్న మృతి చెందిన సౌదీ రాజు అబ్దుల్లా స్థానంలో కొత్త రాజుగా నియమితులైన ఆయన సోదరుడు సల్మాన్ ను ఆయన కలవనున్నారు.

  • Loading...

More Telugu News